- Advertisement -
నవతెలంగాణ – పెద్దవంగర
మండల వ్యాప్తంగా నవరాత్రులు పూజలందుకున్న గణనాథులు శుక్రవారం నిర్వహించిన నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా జరిగింది. మండలంలో దాదాపు 100 గణపతి మండపాలు ఏర్పాటు చేశారు. తొమ్మిది రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో భక్తుల సందడితో పూజలందుకున్న గణపయ్య నిమజ్జనం శనివారం కూడా ప్రశాంతంగా జరిగింది. మండలంలోని ఔసలి తండాలో జరిగిన గణేష్ ఉత్సవాల్లో లడ్డు రూ. 15, 116 లకు తునుగూరి బిక్షం సొంత చేసుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.
- Advertisement -