నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలం లోని ఇందల్ వాయి గ్రామంలో గల పెద్ద చెరువులోకి గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దగచ్చు తెగిపోయినట్లు గ్రామస్తులు శుక్రవారం నవతెలంగాణకు తెలిపారు. గత కొన్ని రోజుల క్రితమే అలుగు వెళ్లడంతో దాని పరిధిలోని ఏడు గ్రామాల ప్రజలు రైతులు హర్షం వక్తం చేశారు.
గత రెండు మూడు రోజుల నుండి ఏడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి దాని ప్రవాహం ఎక్కువగా రావడంతో చెరువు అలుగుపై నుండి పెద్ద ఎత్తున మీరు దిగువన పోతూ ఉండగానే దాని పక్కనే గండి నుండి భారీ నీరు వచ్చి గచ్చులోకి చేరడంతో శుక్రవారం పెద్దగచ్చు తెగిపోయిందని గ్రామస్తులు తెలిపారు. పెద్ద చెరువులోకి ఇప్పటికీ భారీ వరద రావడంతో నిండుకుండలా నిండి ఆందోళనకరంగా ఉందని వారు వివరించారు.