- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం పెద్ద ఎడ్గి గ్రామానికి నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ అనిల్ తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్ ను కలిసినారు. అనంతరం పెద్ద ఏడ్గి గ్రామంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియం అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది, స్టేట్ క్రీకెట్ అసోసియేషన్ చైర్మన్ బిబి పార్టీల్లో సానుకూలంగా స్పందించి అనంతరం ఫండ్స్ రిలీజ్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెద్ద ఏడ్గి మాజీ సర్పంచ్ అస్పత్ వార్ వినోద్, బీజేవైఏం నాయకులు శుభం, మాణిక్ పటేల్, సాయిలు, రవి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



