నవతెలంగాణ – జుక్కల్
మహారాష్ట్రతో పాటు తెలంగాణలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో మండల పరధిలోని పెద్దఎడ్గి వాగు పొంగి పొర్లింది. ఈ క్రమంలో ఈ వాగు పక్కన ఉన్న బిజ్జల్ వాడి , పడంపల్లి , నాగల్ గావ్, పెద్ద ఎడ్గి , చిన్న ఎడ్గి గ్రామాల్లోని రోడ్డు పక్కన ఉన్న పంట పొలాలు వరదనీటిలో మునిగిపోయాయి. సోయా , పెసరా, మినిము, పత్తి పంటలకు భారీగా నష్టం వాటిలిందని పడంపల్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అష్ట కష్టాలు పడి అప్పులు తెచ్చి పంటలు పండిస్తున్నాము. ఒక్కసారిగా ప్రకృతి విలయ రూపం దాల్చి పంటలను నేలపాలు చేసిందన్నారు. ప్రస్తుతం పంట పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. పంటపొలాల్లో నీరు నిలవడంతో వేలు కుళ్ళిపోయి, పూర్తిగా పంట ఎండిపోతుందని లక్షెట్టి బాలాజీ, కత్తే వార్ రాజు , గోవింద్, బిరాదార్ సురేష్, సంజు అనే రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పొంగిపొర్లిన పెద్దఎడ్గి వాగు.. వందల ఎకరాల్లో పంటల నష్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES