Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వర్షపు నీటితో పెద్దగుల్ల రోడ్డు జలమయం

వర్షపు నీటితో పెద్దగుల్ల రోడ్డు జలమయం

- Advertisement -

– పట్టించుకోని సంబంధిత ఆర్ అండ్ బి శాఖ అధికారులు
నవతెలంగాణ – జుక్కల్
: మండల పరిధిలోని పెద్దగుల్లా గ్రామానికి వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు అటువైపు వెళ్లే సరిహద్దు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పాత రోడ్డును తవ్వేసి కొత్త రోడ్డు కొరకు రోడ్డుపైన కంకర వేసి వదిలేశారు. దీంతో నాటి నుండి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎండాకాలంలో దుమ్ము దూళి వెదజల్లడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులను ఎదర్కుంటున్నారు. అయితే ప్రస్తుతం వర్షాలు పడడంతో రోడ్డుపైన నీళ్లు నిలిచి, రోడ్డంతా జలమయమవుతోంది.

ఈ క్రమంలో బాట సారులకు, వాహన చోదకులకు చాలా అంతరాయం కలుగుతోంది. వీరితో పాటు విద్యనభ్యసించేందుకు వెళ్ళే విద్యార్థులు సైతం తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. వర్షం పడిందంటే సంబంధిత గ్రామాలలో పాఠశాలలకు వెళ్లడానికి  మోకాళ్ళ లోతు వరకు నీళ్లలో, బురదలో నుండి నడిచి వెళ్లే దుస్థితి నెలకొంది. ఎమర్జెన్సీ వాహనాలు, అంబులెన్సులు రావాలంటే వాటిని నడిపే డ్రైవర్లు జంకుతున్నారు. గత కొన్ని ఎళ్లు గా ఈ సమస్య ఇలా మూలన పడి ఉండడంతో అక్కడి గ్రామాల ప్రజలు జుక్కల్ మండల కేంద్రానికి రావాలంటే , తిరిగి పోవాలంటే నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా అధికారులు వెంటనే స్పందించి, వెంటనే రోడ్డు పనులను చిన్నగుల్లా నుండి తెలంగాణ బార్డర్ వరకు బీటీ రోడ్డు వేయాలని మండల పరిధిలోని ప్రజలు కోరుతున్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad