Sunday, September 21, 2025
E-PAPER
Homeనల్లగొండపెద్దమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి  సహకరించాలి

పెద్దమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి  సహకరించాలి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణంలోని కిసాన్ నగర్ లో గల  పెద్దమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని  పెద్దమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ కన్వినింగ్ కమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఆదివారం కిసాన్ నగర్ లోని పెద్దమ్మతల్లి దేవాలయంలో పునర్నిర్మాణ ఆలయ కన్వినింగ్ కమిటీ సమావేశం సభ్యులు  ఇట్టబోయిన గోపాల్, గుర్రాల శివ నాగేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట నరసింహ వైఎల్ఎన్ఎస్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ కొలుపుల వివేకానంద మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి పట్టణంలోని అన్ని వార్డులనుండి ఇద్దరు చొప్పున ఒక సమన్వయ కమిటీ ఎన్నుకోనున్నట్లు తెలిపారు. ఈ కమిటీని ఈనెల 14వ తేదీన ఎన్నుకోనున్నట్లు ముదిరాజులందరూ ఆ సమావేశానికి హాజరుకావాలని అన్నారు. ఈ కమిటీ ద్వారా దేవాలయాన్ని అద్భుతముగా పునర్నిర్మాణం చేయాలని కోరారు ఈ ఆలయ పునర్ నిర్మాణానికి  ముదిరాజులతోపాటు పట్టణ ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో వార్డు ల ముదిరాజ్ నాయకులు  సాదు విజయకుమార్,    తుపాకుల శ్రీనివాస్, నీల శ్రీనివాస్,యాట నాగరాజు, ఎనబోయిన జహంగీర్, శాగంటి నరసింహ, గుర్రాల మల్లేష్, యాట నాగరాజు, ఉడుత భాస్కర్, డొప్ప వెంకటేష్, కొలుపుల నాగరాజు, మేడ బోయిన రాము, ఎర్రబోయిన శ్రీనివాస్, జరిగే శంకర్, కృష్ణ, కూర శేఖర్, కనుక బాలరాజు, మంద నర్సింగ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -