నవతెలంగాణ – హైదరాబాద్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి వ్యతిరేకంగా పెద్దపల్లిలో బంద్ నిర్వహిస్తున్నారు. ఉగ్రదాడిలో చనిపోయిన మృతుల ఆత్మకు శాంతిచేకూరాలని కోరూతూ పెద్దపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పట్టణంలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఒక్క షాపు కూడా తెరచుకోకపోవడంతో వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. పెద్దపల్లి కూరగాయల మార్కెట్ జెండా చౌరస్తా కామన్ రోడ్‌లో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది.
- Advertisement -