రామ్ చరణ్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వద్ధి సినిమాస్ బ్యానరపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. నేటి(గురువారం) నుంచి పూణేలో ప్రారంభమయ్యే నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీం సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్ పై అద్భుతమైన పాటను చిత్రీకరించనున్నారు. దీని కోసం ఏఆర్ రెహమాన్ అదిరిపోయే సాంగ్‌ని కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉండనుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
చిత్రీకరణతోపాటు పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో కొనసాగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం సినిమా పూర్తయ్యేలా టీమ్ ప్యాషన్‌తో పని చేస్తోంది. రామ్ చరణ్ తన పాత్ర కోసం కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా పాన్-ఇండియా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన, సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాత: వెంకట సతీష్ కిలారు, సంగీతం: ఏఆర్ రెహమాన్, డీవోపీ: ఆర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, ఎడిటర్: నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్.
పూణేలో ‘పెద్ది’ సాంగ్ చిత్రీకరణ
- Advertisement -
- Advertisement -