Monday, January 19, 2026
E-PAPER
Homeసినిమాభారీ షెడ్యూల్‌లో 'పెద్ది'

భారీ షెడ్యూల్‌లో ‘పెద్ది’

- Advertisement -

కథానాయకుడు రామ్‌ చరణ్‌ నటిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘పెద్ది’. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ఓ భారీ షెడ్యూల్‌ ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్‌ కోసం రామ్‌ చరణ్‌ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. తాజాగా విడుదలైన స్టిల్‌లో రామ్‌చరణ్‌ బీస్ట్‌ మోడ్‌లో కనిపించడం విశేషం. ‘పెద్ది’ ఫస్ట్‌ సింగిల్‌ ‘చికిరి చికిరి’ ఐదు భాషలలో 200 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించి ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది.
ఏ.ఆర్‌. రెహమాన్‌ మ్యూజిక్‌, రామ్‌చరణ్‌ వైరల్‌ డ్యాన్స్‌తో ఈ సాంగ్‌ గ్లోబల్‌ మూమెంట్‌గా మారింది. త్వరలోనే మరో పాటని రిలీజ్‌ చేయబోతున్నారు. వద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు, సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్‌ సమర్పించిన ఈ చిత్రంలో జాన్వి కపూర్‌ హీరోయిన్‌. మార్చి 27న గ్రాండ్‌ పాన్‌-ఇండియా థియేట్రికల్‌ రిలీజ్‌ కాబోతుందని మేకర్స్‌ మరోసారి అనౌన్స్‌ చేశారు.

200 మిలియన్లకు పైగా..
మేకర్స్‌ మాట్లాడుతూ,’మేం ఫస్ట్‌ సింగిల్‌ ‘చికిరి చికిరి’తో మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ ప్రారంభించాం. ఈ పాట అత్యద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఈ ట్రాక్‌ ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. ఐదు భాషలలో 200 మిలియన్లకు పైగా వ్యూస్‌కు చేరుకుంది. ఈ పాట ఇప్పటికే భారీ రిపీట్‌ వాల్యూను సాధిస్తూ 2 మిలియన్‌కు పైగా లైక్స్‌ను, మ్యూజిక్‌ ప్లాట్‌ఫామ్స్‌లో 60 మిలియన్‌కు పైగా ఆడియో స్ట్రీమ్స్‌ను రాబట్టి చార్ట్‌లను ఏలుతోంది. మ్యూజిక్‌ లవర్స్‌, సినిమా అభిమానులు ఈ పాటను మళ్లీ మళ్లీ వింటూ ప్రతి రోజు ప్లేలిస్ట్‌లో తప్పనిసరిగా ఉండే పాటగా మార్చేశారు. ఈ పాట వైరల్‌ తుఫాను సోషల్‌ మీడియాను ముంచెత్తింది. 300+ కంటే ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, 870+ యూట్యూబ్‌ షార్ట్స్‌లో నెటిజన్లు ఐకానిక్‌ హుక్‌ స్టెప్‌ను రిక్రియేట్‌ చేస్తున్నారు. ఇది యంగ్‌ ఆడియన్స్‌లో గ్లోబల్‌ మూమెంట్‌గా మారడం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -