నవతెలంగాణ – సిరిసిల్ల
రాష్ట్రంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో ఎమ్మే రెండవ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశముగా ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రాసిన లాంగ్ మార్చ్ నవల ఎంపికయింది. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాసిన ఈ లాంగ్ మార్చ్ నవలను అధ్యయనం చేయనున్నారు. ఇప్పటికే ఈ నవల ఉస్మానియా యూనివర్సిటీలో సిలబస్ గా ఉంది. దీనితోపాటు నల్గొండలోని నాగార్జున కళాశాల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం మానవ సంబంధాలపై పెద్దింటి రాసిన ప్రముఖ నవల జిగిరి పాఠ్యాంశంగా పెడుతున్నారు. ఈ నవల 12 భాషల్లోకి అనువాదమై వివిధ కళాశాలల్లొ సిలబస్ గా ఉంది. ఈ రెండు నవలలు త్వరలో సినిమాలుగా రానున్నాయి. తెలంగాణ మట్టి జీవితాలను కథలుగా నవలలుగా నాటకాలుగా సినిమాలుగా ఆవిష్కరిస్తున్న పెద్దింటి అశోక్ కుమార్ సిరిసిల్ల పట్టణంలో రాజీవ్ నగర్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
విద్యార్థులకు సిలబస్ గా పెద్దింటి ఉద్యమనవల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES