గౌరి ఫిలింస్‌తో కలిసి సుఖకర్త ఫిలింస్ ప్రొడక్షన్ నెం.1గా ‘పెళ్లిలో పెళ్లి’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శివ సాయిరిషి, సంస్కతి గోరే, విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గణేష్ కోలి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ సంబరం దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్‌తో పాటు బ్యానర్ లాంచ్ కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు తనికెళ్ల భరణి, హీరో ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రొడ్యూసర్ గణేష్ కోలి మాట్లాడుతూ,’సినిమా మేకింగ్ మీద అభిరుచితో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాను. ఈ సినిమా రూపకల్పన బాధ్యత మొత్తం మా దర్శకుడు శ్రీకాంత్ చూసుకున్నారు. ఈ కథలో ట్విస్ట్ ఏంటనేది ఇంకా నాకు కూడా రివీల్ చేయలేదు. నేనూ మీతో పాటే థియేటర్స్‌లో చూడబోతున్నా’ అని అన్నారు.
‘ఈ చిత్రం మా అందరికీ ఒక ఎమోషనల్ జర్నీ. ఆ ఎమోషన్ ప్రేక్షకులకు కూడా రీచ్ అవుతుందని నమ్ముతున్నాం. ఎంఎల్ రాజా ఇచ్చిన మ్యూజిక్ మా మూవీకి సోల్ లాంటిది’ అని డైరెక్టర్ శ్రీకాంత్ సంబరం చెప్పారు.
‘పెళ్లిలో పెళ్లి’ ఎలా జరిగింది?
- Advertisement -
- Advertisement -