Wednesday, May 21, 2025
Homeతెలంగాణ రౌండప్మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో పెండెం శ్రీకాంత్ 

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో పెండెం శ్రీకాంత్ 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో పెండెం శ్రీకాంత్ ఉన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పెండెం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ ఉపాధ్యక్షుడిగా పని చేసిన అనుభవం, ప్రధానంగా మండలానికి చెందిన యువతను ఏకతాటిన నడిపి ఎన్నికల్లో పార్టీ విజయానికి నిర్విరామంగా కృషి చేయడం జరిగిందన్నారు. పార్టీ ద్వారా అనేక పనులను నాణ్యతతో చేయడంతో పాటు పార్టీకి విశేషమైన గుర్తింపు తేవడానికి విశేషంగా కృషి చేయడం జరిగిందన్నారు. యువతకు పార్టీలో ప్రాధాన్యత కొరకు కృషి చేయడం జరిగిందని ముందు ముందు కూడా యువతకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తానని శ్రీకాంత్ అన్నారు. జిల్లా స్థయిలో మండల స్థాయిలో  యువత అన్ని రంగాల్లో ముందుండే విధంగా మంత్రి సీతక్క సలహాలు సూచనలతో యువతకు ప్రాధాన్యత పెరిగే విధంగా ముందుకు సాగడం జరుగుతుందని అన్నారు. మండల అధ్యక్ష పదవి రేసులో తనకు ప్రాధాన్యత లభిస్తుందన్న ఆశాభావాన్ని శ్రీకాంత్ వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్  మరియు, ములుగు జిల్లా ఇన్చార్జి, మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, పుల్లా కైలాసం  నే త,   సమక్షంలో గోవిందరావుపేట మండల పార్టీ అధ్యక్ష పదవికి  పోటీ చేస్తూ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో, ములుగు జిల్లా కాంగ్రెస్ నాయకులు, గోవిందరావుపేట మండలం నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -