ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో డిసెంబర్‌కు సంబంధించిన రూ.713 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు బుధవారం డిసెంబర్ నెలకు చెందిన రూ.713 కోట్ల బిల్లులను విడుదల చేశారు. ప్రతినెలా రూ.700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులను విడుదల చేస్తామంటూ ఉద్యోగ సంఘాలకు ప్రజా ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ నెలాఖరులో రూ.183 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత ఆగస్టు నుంచి ప్రతినెలా కనీసం రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వచ్చింది. ఉద్యోగుల గ్రాట్యూటీ, జీపీఎఫ్, సరెండర్ లీవులు, అడ్వాన్స్‌లకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్‌కు సంబంధించి రూ.713 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయడం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ.713 కోట్లు విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



