Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ కూలీల పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలి

ఉపాధి హామీ కూలీల పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలి

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
ఉపాధి హామీ కూలీలకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేశనాయక్ డిమాండ్ చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఉంది కూలీలకు డబ్బులు ఇస్తేనే పండగ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. మంగళవారం మండల పరిధిలోని బొమ్మనపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు. సమస్యలను అడిగి తెలుసున్నారు. రైతులను ఉద్దేశించి  మాట్లాడారు. జనవరి నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అకౌంట్లో కూలీలకు పడలేదని వారు అన్నారు. కూలీలకు పండగ పూట అర్ధ ఆకలితో తో పస్తులు ఉండవలసిన పరిస్థితి పట్టిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం వి బి జి రామ్ జి చట్టాన్ని తీసుకొచ్చి కూలీలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని పాత పద్ధతి ద్వారానే నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సైదులు, వీరయ్య, శ్రీనివాస్, రవి, కూలీలు లక్ష్మి, తిరుపతమ్మ, వెంకటయ్య, బాలయ్య, ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -