Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లు లను చెల్లించాలి  

మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లు లను చెల్లించాలి  

- Advertisement -

వంట కార్మికులకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలి
యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొరిమి సుగుణ
విద్యాశాఖ అధికారికి  వినతి
నవతెలంగాణ- భూపాలపల్లి

మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొరిమి సుగుణ డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు చెల్లించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా  మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో  జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డీఈవో రాజేందర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కొరిమి సుగుణ మాట్లాడుతూ…. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ పెండింగ్   బిల్లులను వెంటనే చెల్లించాలని,  కార్మికుల అప్పులు తెచ్చి వంటలు వండి పిల్లలకు భోజనాలు పెడుతున్నామని, వాటి వల్ల అప్పుల పాలై దుర్భర జీవితాలు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

అట్లాగే వంట కార్మికుల బిల్లులను ప్రతినెల 5వ తేదీ లోపు చెల్లించాలని కేరళ ప్రభుత్వం రోజుకు 600 చెల్లిస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం  చెల్లించి ఆదుకోవాలని అన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల వేతనం ఇస్తానని చెప్పడం జరిగిందని వెంటనే హామీని నిలబెట్టుకోవాలని కోరారు. నిత్యవసర వస్తువులు ఆహార ప్రైవేటు ఏజెన్సులకు ఇవ్వరాదని 9, 10 తరగతి విద్యార్థులు మెస్ బిల్లులను చెల్లించాలని పెరుగుతున్న వస్తువుల ధరలకు అనుగుణంగా కోడిగుడ్లు, గ్యాస్ ఇతర వస్తువుల ధరలను మెనూ చార్జీలను పెంచాలని కోరారు. ప్రభుత్వ వంట సామాగ్రి నిత్యవసర వస్తువులు సరఫరా చేసి హామీ ఇచ్చి నేటికీ పంపిణీ చేయనందు వంటలు చేయలేకపోతున్నామని తెలిపారు. కార్మికులకు ఈ ఎస్ ఐ, పి ఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ కిష్ట స్వామి,  వంట కార్మికులు ఉమాదేవి, ఎన్ మల్లమ్మ, సుగుణ, పద్మ,రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -