Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

- Advertisement -

ఎనిమిది నెల పెండింగ్ వేతనాలు చెల్లించాలి 
బిల్లులు చెల్లించకుంటే మధ్యాహ్న భోజనం నవంబర్ 1 నుండి బందు పెడతాం 
సిఐటియు మండల కార్యదర్శి అంజయ్య 
నవతెలంగాణ –  మిరుదొడ్డి

మధ్యాహ్న భోజన కార్మికుల 8 నెలల పెండింగ్ బిల్లులు వేతనాలు వెంటనే చెల్లించాలి లేకుంటే నవంబర్ 1 నుండి మధ్యాహ్న భోజనాన్ని బందు పెడతామని సిఐటీయు మండల కార్యదర్శి మద్దెల అంజయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తున్న కార్మికులకి గత ఎనిమిది నెలల కాలం నుండి కోడిగుడ్లు, కూరగాయల బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారని పాఠశాలలు తప్పనిసరిగా భోజనాలు పెట్టాలి కాబట్టి అప్పులు తెచ్చి భోజనాలు వడ్డన చేసి పెడుతున్న బిల్లులు మాత్రం రావట్లేదని దీంతో కార్మికులు అప్పుల్లో కూరుకుపోతున్నారన్నారు వెంటనే బిల్లులు చెల్లించాలి.

పెరిగిన ధరలకు అనుగుణంగా కోడిగుడ్లు, కూరగాయలకు అదనంగా రేట్లు పెంచి ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వేతనం 1000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ₹2,000 ఎనిమిది నెలల కాలం నుండి వేతనాలు చెల్లించకపోవడం మూలంగా ఒకవైపు పెండింగ్ బిల్లులు రాక మరోవైపు చేసిన పనికి వేతనాలు రాక రెండు రకాలుగా మధ్యాహ్న భోజనం కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎలాగైనా ప్రభుత్వ పాఠశాలలో భోజనాలు తప్పనిసరిగా పెడుతున్నప్పటికీ కలెక్టర్ గారు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలన చేసి  విద్యార్థులకు నాసిరకమైన భోజనం వడ్డిస్తున్నారు అంటూ చెబుతున్నారు.

కానీ వారికి అందించాల్సిన పెండింగ్ బిల్లులు మాత్రం ఇవ్వడం లేదు అలాగే వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో చేసేది లేక ఉన్నటువంటి పరిస్థితులు బట్టి భోజనాలు పెడుతున్నప్పటికీ కలెక్టర్ గారు వేధింపులు పెరిగాయని వారు అన్నారు. ఇప్పటికైనా మధ్యాహ్న భోజన కార్మికులకు పెట్టిన బిల్లులను చెల్లించి పెండింగ్ వేతనాలు చెల్లించి ఆదుకోవాలని లేనిపక్షంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనము నవంబర్ 1 నుండి భోజనం వడ్డించడం బందు పెడతామని సందర్భంగా హెచ్చరించారు. కసా పద్మ,మలవ్వ, ఏళ్లవ్వ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -