Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ పెండింగ్ డిఎలను తక్షణమే చెల్లించాలి

 పెండింగ్ డిఎలను తక్షణమే చెల్లించాలి

- Advertisement -

టీఎస్ యూటీఎఫ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మురళి కృష్ణ
నవతెలంగాణ – నెల్లికుదురు

రాష్ట్ర ప్రభుత్వ  ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయి ఉన్న ఐదు విడతల డి.ఎ లను తక్షణమే చెల్లించాలని టీ.ఎస్.యూ.టి.ఎఫ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మురళి కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు తెలిపారు. బుధవారం నెల్లికుదురు మండలంలో జరిగిన టీ.ఎస్.యూ.టి.ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ బెనిఫిట్స్ సకాలంలో ప్రభుత్వం చెల్లించకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర వేదన అనుభవిస్తున్నారని, మరి కొందరు మానసిక వేదనతో అకాల మరణాలకు గురవుతున్నారని ,ఇటీవల తమ గోడును వెళ్లబోసుకుని చనిపోయిన పదవీ విరమణ ఉపాధ్యాయుడు కొండయ్య ఉదంతాన్ని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.

ఈ-కుబేర్ పెండింగ్ బిల్లులు ఉపాధ్యాయులకు సంబంధించిన జీపీఎఫ్  టీజీజీఎల్ఐ , మెడికల్ రీయింబర్స్‌మెంట్, సరెండర్ లీవ్, లీవ్ శాలరీ, సప్లిమెంటరీ బిల్లులలో చేసిన శాలరీలు వంటి బిల్లులు నెలల తరబడి ‘ఈ-కుబేర్’ లో పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా 2024 మార్చి నుండి రిటైర్ అయినవారి చెల్లింపులు కూడా నిలిచిపోయాయని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న ఈ-కుబేర్ వెంటనే  చెల్లించలన్నారు. మోడల్ స్కూల్  ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలను చెల్లించాలని వారికి హెల్త్ కార్డులను వెంటనే ఇవ్వాలని, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని, రెగ్యులర్ ఉపాధ్యాయులకు ఇస్తున్న వేతన స్కేల్‌లో ‘మినిమమ్ బేసిక్’ ను వర్తింపజేయడానికి తగు నిర్ణయం చేయాలని డిమాండ్ చేశారు.

 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ప్రతి సంవత్సరము కొంత మొత్తంలో జీతము పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.  ప్రభుత్వం తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించి, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని మురళి కృష్ణ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బానోతు హరినాయక్, నెల్లికుదురు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే రంజిత్ కుమార్ మరియు కోట జనార్ధన్, మండల నాయకులు భాస్కర్, లక్ష్మణ్, నరేందర్, రవీందర్ ల పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -