బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్..
నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్
పెండింగ్ లో ఉన్న రూ.8000 వేలకోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సూర్యాపేట పట్టణ కేంద్రంలో వెయ్యి మంది విద్యార్థులతో భారీ ర్యాలీ గా 60 పీట్ల రోడ్డు నుంచి శంకర విలాస్, కొత్త బస్టాండ్ వరకు వేలాదిమంది విద్యార్థులతో భారీ ప్రదర్శిన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల కాక ప్రవేట్ యజమాన్యాలు విద్యార్థులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
అదే విధంగా పై చదువుల కొరకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు తక్షణమే ప్రభుత్వం స్పందించి సంక్షేమ హాస్టల్ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మెస్ బిల్లులు అదేవిధంగా సంక్షేమ హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించాలి సరేనా సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారు. ప్రభుత్వం కూడా విద్యార్థులతో జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పోనుగంటి రంగా, తెలంగాణ స్టూడెంట్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్, బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు పోలోజు మహేష్ చారి, బీసీ యువజన సంఘం నేతలు పరల సాయి, బీసీ యువజన సంఘం నియోజకవర్గం అధ్యక్షుడు రాజబోయిన సుమన్, శివ, సాయి కుమార్, విద్యార్థులు విజయ కుమారి, లక్ష్మి, అనుష, సంగీత, భవాని, తదితర విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



