Monday, November 3, 2025
E-PAPER
Homeకరీంనగర్పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్లు, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలి.. 

పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్లు, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలి.. 

- Advertisement -

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారం ప్రశాంత్..
నవతెలంగాణ – వేములవాడ 
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. సోమవారం వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్లు, స్కాలర్‌షిప్‌లు గత ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 2023-24 విద్యాసంవత్సరం కోసం రూ.2,100 కోట్లు, 2024-25 సంవత్సరానికి రూ.2,100 కోట్లు, 2025-26 విద్యాసంవత్సరానికి రూ.2,200 కోట్లు,మొత్తం రూ.6,300 కోట్లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పటి నుండి బకాయిలుగా ఉన్నాయని చెప్పారు. అదనంగా, గత ప్రభుత్వ కాలం నాటి రూ.4,100 కోట్ల బకాయిలు కూడా కలిపి మొత్తం రూ.10,500 కోట్ల పెండింగ్ ఉందని వివరించారు.

ప్రశాంత్ మాట్లాడుతూ, దసరా పండుగకు ముందు ప్రభుత్వం చర్చల సందర్భంగా రూ.300 కోట్లు, దీపావళికి రూ.900 కోట్లు, నవంబరులో రూ.300 కోట్లు మొత్తం రూ.1,200 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేశారని విమర్శించారు.దీని ఫలితంగా విద్యార్థులే స్వయంగా ఫీజులు చెల్లించుకుంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ కళాశాల హాస్టల్ ఫీజులు కూడా విద్యార్థులే భరించాల్సి వస్తోందని తెలిపారు. మరోవైపు ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఆర్థిక ఇబ్బందులతో సమ్మెలకు సిద్ధమవుతున్నాయని చెప్పారు.ఎస్ఎఫ్ఐ నాయకుల వినతిని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సానుకూలంగా స్వీకరించి, బకాయిల విడుదల కోసం ప్రభుత్వ స్థాయిలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కడారి శివ, భరత్, సాయి తో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -