Friday, July 11, 2025
E-PAPER
Homeజిల్లాలు పెండింగ్ ఫీజులు, రీయంబర్స్ మెంట్స్ & స్కాలర్ షిప్స్ తక్షణమే విడుదల చేయాలి..

 పెండింగ్ ఫీజులు, రీయంబర్స్ మెంట్స్ & స్కాలర్ షిప్స్ తక్షణమే విడుదల చేయాలి..

- Advertisement -

బకాయిలతో సంబంధం లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వాలి..
బకాయిలు విడుదల కాక అంధకారంలో విద్యార్థుల భవిష్యత్తు..
ఎమ్మెల్యే కుంభంకు వినతిపత్రం
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల రాహుల్..
నవతెలంగాణ – భువనగిరి
: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ ఫీజురీయంబర్స్ మెంట్స్, స్కాలర్ షిప్స్ తక్షణమే విడుదల చేయాలని, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల రాహుల్ అన్నారు.  గురువారం భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డికి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 లో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నాటి ప్రభుత్వం తీసుకుని వచ్చిందన్నారు. ప్రభుత్వమే సామాజికంగా, ఆర్థికంగా వెనుక బడిన వర్గాల విద్యార్థులకు డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు, యూనివర్సిటీ విద్య చదువుతున్న విద్యార్యులకు ఈ ఫీజును చెల్లిస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంగా విభజన చెందినా తర్వాత ఏర్పడిన  బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని మార్చాలని చూసిందన్నారు. విద్యార్థులు ఉద్యమించటంతో నిర్ణయం వెనక్కు తీసుకుందన్నారు. 2014 నుండి 2018 వరకు ఫీజులు చెల్లించిన బి ఆర్ ఎస్ ప్రభుత్వం 2019- 20 విద్యాసంవత్సరం కొంత బకాయిలను ఉంచిందన్నారు. అప్పటి నుండి రాష్ట్రంలో 2024 వరకు సుమారు 5358 కోట్ల స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు ఇతర స్కీం లకు వాడుకుందన్నారు. విద్యార్థులకు ఒక్క పైసా చెల్లించకుండా వారి చదువుల నుండి మధ్యలోనే డ్రాప్ అయ్యే చర్యలకు పూనుకుందన్నారు. బిఆర్ఎస్ పాలనలో ఫీజు బకాయిలు ఇవ్వలేదని, ఈ పథకాన్ని తీసుకుని వచ్చింది మా కాంగ్రెస్ అని మేం అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి  ఫీజుల బకాయిలు చెల్లించలేదన్నారు. పైగా ఆర్థిక పరిస్థితి బాగా లేదని బుకాయిస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ పథకానికి సవరణలు చేసి ముందు విద్యార్థుల డబ్బులు పెట్టి చదువుకోవాలని తర్వాత మేము ఫీజు రీయింబర్స్ చేస్తామని వాదిస్తోందన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 13 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూ ఎస్ విద్యార్థులు చదువుతున్నారు. వారికి గత ప్రభుత్వాల బకాయి, కాంగ్రెస్ ఇవ్వాల్సిన నిధులు కలిపి 8,158 కోట్లు నిధులు ఇవ్వాలన్నారు. ప్రైవేట్ కళాశాలలు, విద్యాసంస్థలు విద్యార్థులకు ఫీజులు ప్రభుత్వం ఇవ్వడం లేదని పేరుతో విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్త పరిచారు.  బకాయిలతో సంబంధం లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే  స్థానికులంగా స్పందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -