Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి

పెండింగ్ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి

- Advertisement -

ప్రయివేటు అధ్యాపకుల మద్దతు, ర్యాలీ 
నవతెలంగాణ – మిర్యాలగూడ 

పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని విజేత డిగ్రీ కళాశాల నిరవదిక  బంద్ సోమవారం ప్రారంభమైంది. కళాశాలలో బంద్ చేసి ప్రవేట్ అధ్యాపకులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లు ఇవ్వక పోవడం వలన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. అధ్యాపకుల జీవితాలు దిక్కు తోచని స్థితిలోకి నెట్టి వేయబడ్డాయన్నారు.యాజమన్యాలు నిరవధిగా అర్ధాంతరంగా కళాశాలలను మూసివేయడంతో అధ్యాపకుల పరిస్థితి గోరంగా మారిందన్నారు.

భవిష్యత్తులో కూడా పరీక్షలు, ప్రాక్టికల్స్ లను కూడా నిర్వహించలేమని యాజమాన్యాలు ప్రకటించాయని తెలిపారు. వెంటనే పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ధనుంజయ సార్, వైస్ ప్రిన్సిపాల్ మధు, చారి ,యాదయ్య దుర్గయ్య, హరి, ప్రభాకర్, రమేష్, రాజారాం, సతీష్ వీరయ్య, చారి, జ్యోతి, సైదమ్మ, శ్రీరాం, స్వామి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -