Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి..

పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి పాఠశాల ప్రిన్సిపాల్ పూర్ణచందర్రావుకు ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అసలే చాలీచాలని వేతనాలతో ఇబ్బందులకు గురివుతున్న నేపథ్యంలో నెలలవతరబడి వేతనాలు పీడింగ్ లో ఉండడంతో పూట గడవని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు సకాలంలో అందకపోవడంతో నిత్యవసర సరుకులు కొనుక్కొలేని దుస్థితిలో ఉన్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ పక్కల రాజబాబుకంప్యూటర్ ఆపరేటర్ రాజేంద్రప్రసాద్, ఆఫీస్ సబార్డినేటర్ కనుకుల చంద్రయ్య, నైట్ వాచ్మెన్ వేల్పుల మధునయ్య పాల్గొన్నారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad