Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి..

పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి..

- Advertisement -

రహదారిపై అర్థనగ్నం ప్రదర్శన..
నవతెలంగాణ – డిచ్ పల్లి

పెండింగ్ లో ఉన్న రూ.8500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే  విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో డిచ్ పల్లి నిజామాబాద్ రాహదరిపై విద్యార్థులు అర్ధ నగ్న ప్రదర్శన చేశారు. ఈసందర్భంగా ఎబివిపి  స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోహన్  మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న  8500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే  విడుదల చేయాలని అన్నారు అందులో 30 కోట్లు తెలంగాణ యూనివర్సిటీ కీ రావాల్సి ఉందని అన్నారు. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేసేంతవరకు ఏబీవీపీ పోరాటం ఆగదన్నారు.పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత విద్యను దూరం  చేసే కుట్ర  ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్న కనీసం ఇప్పటివరకు విద్యార్థుల గురించి మాట్లాడిన ఎమ్మెల్యేలు, మంత్రులు  మాట్లాడిన దాఖలాలు లేవన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులను  రాష్ట్రంలో ఎక్కడ తిరగనివ్వమని హెచ్చరించారు.జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించాలని మీ బిడ్డలకు స్కాలర్షిప్ ఇవ్వకుండా విద్యను దూరం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు టెండర్లు మీద సహచర మంత్రుల మీద కామెంట్ చేయడం మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. 1200 కోట్ల స్కాలర్షిప్ బకాయిలను రిలీజ్ చేస్తాం, 1000 కోట్ల రిలీజ్ చేస్తాం అనే బేరాలు ఆడటం మానుకొని విద్యార్థులకు రావాల్సిన ప్రతి రూపాయి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్ ప్రభుత్వం బిక్ష కాదని అది మా హక్కన్నారు.లేనిపక్షంలో రేవంత్ రెడ్డిని గద్ద దింపే వరకు ఏబీవీపీ పోరాడుతుందని అన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి రాష్ట్ర రోకో చేస్తున్న విద్యార్థులను అక్కడినుండి తరలించారు.

 ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు పృద్వి, యూనివర్సిటీ కార్యదర్శి సమీర్, యూనివర్సిటీ ఉపధ్యక్షులు అశోక్,అక్షయ్, అజయ్ యూనివర్సిటీ సంయుక్త కార్యదర్శులు అనిల్, నవీన్, సోషల్ మీడియా ఇంచార్జ్ కార్తీక్ ,విద్యార్థి నాయకులు శివ, విజయ్, పవన్ కళ్యాణ్, రామకృష్ణ ,అభిలాష్, నెహ్రూ,రోహన్, హర్షవర్ధన్ ,నందన్ నితిన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -