Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి

పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి

- Advertisement -

కళ్లకు గంతలు కట్టుకొని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన 
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్
నవతెలంగాణ – అచ్చంపేట
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కళ్లకు గంతలు కట్టుకొని ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ సందర్భంగా ఎండి.సయ్యద్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మేము అధికారంలోకి రాగానే విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15% నిధులను విద్యా రంగానికి కేటాయిస్తామని చెప్పి విద్యార్థులు మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిధులను విడుదల చేయకుంటే విద్యార్థులందరినీ ఐక్యం చేసి భవిష్యత్తులో ఉద్యమాలను ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ప్రవీణ్, శివ, తరుణ్, విజయ్, తదితరులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -