- Advertisement -
- – స్కాలర్షిప్ విడుదల చేయాలని సెప్టెంబర్ 2న చలో కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయండి…
– ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటి సభ్యురాలు మేడబోయిన మమత…
నవతెలంగాణ – భువనగిరి - పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని సెప్టెంబర్ 2న వేలాది మంది విద్యార్థులతోటి చలో కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయాలని, అసెంబ్లీ సమావేశాల్లో స్కాలర్షిప్లు విడుదలపై చర్చ జరగాలని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటి సభ్యురాలు మేడబోయిన మమత అన్నారు. శనివారం స్థానిక ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు.
- ఈ సందర్భంగా మేడబోయిన మమత హాజరై మాట్లాడుతూ.. గత ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న 8150 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న రియంబర్స్మెంట్ ఊసు ఎత్తడం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో స్కాలర్షిప్లపై చర్చ జరిపి స్కాలర్షిప్లో విడుదల కోసం ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించాలన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని సెప్టెంబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా జరుగు కలెక్టరేట్ ముట్టడిలో వేలాది మంది విద్యార్థులు పాల్గొని ప్రభుత్వంలో చలానం రావడం కోసం, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు అన్నారు.
- భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలన్నారు. జిల్లాలో అన్ని గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలని సంక్షేమ హాస్టలకు సొంత భవనాలు నిర్మించాలని గురుకులాలు విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించాలన్నారు. గురుకులాలకు సొంత భవనాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల రాహుల్ దరావత్ జగన్ నాయక్, జిల్లా సహాయ కార్యదర్శి పుట్టల ఉదయ్ హిందు రాణి పాల్గొన్నారు.
- Advertisement -