ఎమ్మెల్సీ కవితకు ఎస్‌ఎఫ్‌ఐ-డివైఎఫ్‌ఐ వినతి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయాంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ,డివైఎఫ్‌ఐ ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వినతిపత్రం అందజేశారు. ఆలేరు పర్యటనకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్సీ కవితను కలిసిన విద్యార్థి సంఘాల నాయకులు తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆలేరు మండల కార్యదర్శి కాసుల నరేష్ మాట్లాడుతూ స్కాలర్‌షిప్‌లు ఆలస్యమవడం వల్ల పేద,మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఫీజులు చెల్లించలేక చదువులు మధ్యలోనే మానేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు,ఫీజు రీయాంబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్సీని కోరారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.



