Saturday, December 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపెన్‌పహాడ్‌ ఫొటోగ్రాఫర్‌కు జాతీయ స్థాయి గుర్తింపు

పెన్‌పహాడ్‌ ఫొటోగ్రాఫర్‌కు జాతీయ స్థాయి గుర్తింపు

- Advertisement -

– లంబాడి జీవనశైలి, సంప్రదాయాలపై ఫొటోలు
నవతెలంగాణ-పెన్‌పహాడ్‌

లంబాడి జీవన శైలి, సంప్రదా యం ఉట్టిపడేలా ఫోటోలు తీసిన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మం డలంలోని చెట్ల ముకుందాపురం గ్రామానికి చెందిన ఫొటో గ్రాఫర్‌ వాస శ్రీనివాసుకు జాతీయ స్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్‌ అవార్డు వరి చింది. ప్రముఖ ఫ్యాకల్టీ హుస్సేన్‌ ఖాన్‌( ఏఎఫ్‌ఐఏపీ) ఆధ్వరంలో 8వ జాతీ య స్థాయి ఫొటోగ్రఫీ వర్క్‌షాప్‌ నిర్వాణలో భాగంగా ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం రాళ్లబండ గ్రామంలో ఈ నెల 13 నుంచి 15 వరకు నిర్వహిం చారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఫొటోగ్రాఫర్లు లంబాడి సంస్కృతీ సంప్రదాయాల గురించి ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో లంబాడి జీవనశైలి సంప్రదాయాలపై శ్రీనివాస్‌ తీసిన ఫొటో ఎంపికైంది. ఎఫ్‌ఆర్‌పీఎస్‌ టి.శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా శ్రీనివాస్‌ అవార్డు అందుకున్నారు. శుక్రవారం గ్రామస్తులు ఆయన్ను ఘనంగా సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -