Friday, May 16, 2025
Homeతెలంగాణ రౌండప్మృతుడి కుటుంబానికి పెన్షన్ బెనిఫిట్స్ ఇప్పించాలి ..

మృతుడి కుటుంబానికి పెన్షన్ బెనిఫిట్స్ ఇప్పించాలి ..

- Advertisement -

టీజీవో సంఘం పక్షాన విన్నవించిన ప్రతినిధులు 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: ధర్పల్లి మండల వ్యవసాయ అధికారి సంగేo. ప్రవీణ్ గత సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో మరణించడం జరిగింది. అతని కుటుంబానికి రావలసిన పెన్షన్ బెనిఫిట్స్, కారుణ్య నియమాకం ఇప్పించడంలో సంబంధిత అధికారి నిర్లక్ష్యం వహించి అతని కుటుంబాన్ని వేధింపులకు గురిచేసినందుకు టీజీవో అధ్యక్షులు అలుక. కిషన్, టీజీవో కార్యదర్శి సంగేo. అమృత్ కుమార్, టీజీవో కోశాధికారి సబావత్ దేవి సింగ్, టీజీవో ఈసీ మెంబర్ చందర్, టీజీవో  సంఘ బాద్యులు అందరు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ని కలసి సమస్యను పరిష్కరించాలని టీజీవో పక్షాన గురువారం విన్నవించారు. అందుకు జిల్లా కలెక్టర్  సానుకూలంగా స్పందించి అతని కుటుంబానికి రావలసిన బెనిఫిట్స్ వ్యవసాయ కమిషనర్ హైదరాబాద్ తో మాట్లాడి సమస్యను పరిష్కారానికి కృషి చేయడం జరిగిందన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారిపై విచారణ అధికారిని నియమించడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -