- Advertisement -
మంద కృష్ణ మాదిగ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల పింఛన్‌ను రూ 6 వేలకు, వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు అన్ని రకాల చేయూత పింఛన్లు రూ 4 వేలకు పెంచాలని ఎంఆర్‌పీఎస్ జాతీయ అద్యక్షులు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సికింద్రాబాద్ నియోజక వర్గంలో పెన్షన్‌దారుల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పింఛన్ లబ్దిదారులను సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. పింఛన్లు పెంచకపోతే నవంబర్‌లో చలో హైదరాబాద్ నిర్వహించి, పరేడ్ గ్రౌండ్‌లో లక్షలాది మందితో మహా గర్జన నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
- Advertisement -