నవతెలంగాణ కంఠేశ్వర్
ఉద్యోగి తన యవ్వనాన్ని, జీవితాన్ని పూర్తిగా ప్రభుత్వం కోసం ,ప్రజల కోసం, పని చేసిన తర్వాత వారి చరమాంకంలో ఆర్థికంగా ఆదుకోవటానికి ప్రభుత్వాలు కల్పించే ఒక ఆసరా పెన్షన్ అని, ఇది ప్రభుత్వ బిక్ష కాదని, దీన్ని కాలరాయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఉద్యోగులు, కార్మిక వర్గంతో కలిసి ఐక్యంగా పోరాడినప్పుడు మాత్రమే పెన్షన్ ని కాపాడుకోగలుగుతామని ఇన్సూరెన్స్ ఉద్యోగుల జాతీయ నాయకులు జి .తిరుపతయ్య అన్నారు. ఆదివారం ఎంప్లాయిస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ భవన్లో జరిగిన సదస్సుకు ఆయన ప్రధాన వక్తగా హాజరై మాట్లాడారు. పెన్షన్ ను కాలరాయటానికి ప్రభుత్వాలు, ఈపీఎస్ పెన్షన్ అని, న్యూ పెన్షన్ స్కీం అని ,యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని, కొత్త పెన్షనర్లు పాత పెన్షనర్ లంటూ వర్గీకరించి పెన్షన్ ను ఎగవేయటానికి ప్రయత్నం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇప్పుడు డి ఏ ప్రమాదంలో పడిందని, రెండు శాతంగా ఉన్న పెన్షనరులు ఖర్చులు బాగా పెరిగాయని తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయని, సలహాలు ఇస్తున్నాయని ఆయన అన్నారు. వాటిని అమలు పరిచేందుకు ప్రభుత్వాలు మోగ్గు చూపిస్తున్నాయని, పోరాడి సాధించుకున్న అనేక హక్కులు ,చట్టాలను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా ఉద్యోగులు కార్మికులు ఇతర ప్రజానీకమంతా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయని దాన్లో భాగంగానే మే20 తేదీన దేశవ్యాప్త సమ్మెకు పూనుకున్నాయని ఆయన తెలిపారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా రావలసిన డిఏలు, పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలు చెల్లించకుండా ప్రజలను ఉద్యోగులపై రెచ్చ కొడుతున్నారని, జేఏసీ ప్రభుత్వం ముందు పెట్టిన సమస్యలన్నీ న్యాయ సమ్మతమైనవని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని ఆయన అన్నారు . స్టడీ సర్కిల్ జిల్లా కన్వీనర్ కే రామ్మోహన్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్యాంకు ఉద్యోగుల నాయకులు వెంకటేష్ , బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నాయకులు ఈవిల్ నారాయణ, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతి శేఖర్, మెడికల్ రిప్స్ యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, జన విజ్ఞాన వేదిక నాయకులు విజయానందరావు, ఎంప్లాయిస్ స్టడీ సర్కిల్ బాధ్యులు ఎల్ శ్రీధర్, మదన్ మోహన్, తదితరులు అతిధులుగా హాజరై ప్రసంగించారు. ప్రజా కళాకారులు సిర్ప లింగయ్య, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆలపించిన గీతాలు ఆహుతులను అలరించాయి.
పెన్షన్ ఉద్యోగుల ప్రాథమిక హక్కు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES