- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
జాతీయ పెన్షనర్ల డే సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్ల కోసం ఆటల పోటీలను గత రెండు రోజులుగా వివిధ పోటీలను నిర్వహించారు. చెస్, క్యారమ్స్, స్కిల్ గేమ్స్ ,ఫాస్ట్ వాకింగ్, తదితర విభాగాలలో పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు ఈనెల 19 జరగనున్న పెన్షనర్స్ డే సందర్భంగా బహుమతులను ప్రధానం చేస్తారు.ఈ ఆటలు పోటీలను డివిజన్ అధ్యక్షులు దయా రాధా కిషన్, కార్యదర్శి వి. సాంబశివరావు సంఘ నాయకులు ప్రసాద్ ,వెంకటేష్, డి లక్ష్మీనారాయణ తదితరులు నిర్వహించారు.
- Advertisement -



