నవతెలంగాణ – కంఠేశ్వర్
పెండింగ్ డీఏల విడుదల, కొత్త పీఆర్‌సీ అమలు, నగదు రహిత వైద్యసేవలు, పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపు వంటి ప్రధాన డిమాండ్ల సాధనకు ఆగస్టు 11న ‘చలో హైదరాబాద్’ పేరిట ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ తెలిపింది.
శనివారం పెన్షనర్స్ భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్రావు మాట్లాడుతూ.. తమ సమస్యలపై మంత్రులను, అధికారులను పదేపదే కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు. 3 లక్షల మందికి పైగా పెన్షనర్లు తీవ్ర ఆవేదనతో ఉద్యమించాలని నిర్ణయించారని నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు శిర్ప హనుమాన్లు అన్నారు. ఈ పత్రిక విలేకరుల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ వీల్ నారాయణ. జిల్లా నాయకులు జార్జ్, బోజరావు, జి నరేందర్, సాంబశివరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 11న హైదరాబాద్ లో పెన్షనర్ల ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES