పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలి..
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్ : పెన్షన్లు ఏ ఆధారం లేని వారికి భద్రత కలిగిస్తాయని, పెన్షన్ల పంపిణి పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చేయూత పథకంపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీఒలు, పంచాయతీ సెక్రటరీలు, బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏ ఆధారం లేని వారికి పెన్షన్ అందిస్తే వారిని ఆదుకున్న వారమవుతామని అధికారులు పెన్షన్ల పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలని, వృద్ధులకు వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం ద్వారా పంపిణీ చేస్తున్న పెన్షన్లలోఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు.
పింఛన్లకు సంబంధించి ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీ లాగిన్ లో ఉన్న వివరణ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీలు చనిపోయిన వారి వివరాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు, ప్రత్యేకించి వృద్ధాప్య పెన్షన్లలో చనిపోయిన వారి పేర్లను ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఆన్లైన్లో జాబితా నుండి తొలగించాలని, ఒకవేళ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు ఉంటే స్పష్టంగా పేర్కొనలని ఆదేశించారు. చనిపోయిన వారి స్థానంలో వారి భార్య లేదా భర్తకు పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తపాలా కార్యాలయాలలో కూడా పెన్షన్ల పంపిణీ జాగ్రత్తగా ఇవ్వాలని పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగనేకుండా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపీడీవోలు మండలాలలో నిర్వహించే సమావేశాలలో చనిపోయిన పెన్షన్ల తొలగింపు పై చర్చ జరగాలని తెలిపారు. పంచాయతీ సెక్రటరీలు పెన్షన్ల పంపిణీ జరిగేటప్పుడు తప్పక పరిశీలించాలని తెలిపారు.
లబ్ధిదారుడికి మొత్తం అందేలా చూడాలని పెన్షన్లు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా రిజిస్టర్లలో నమోదు చేయాలని అలాగే గ్రామాలలో తప్పనిసరిగా మరణ రిజిస్టర్ నిర్వహించాలని తెలిపారు. అర్హులకు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ వీవి అప్పారావు, డిఎల్పిఓ నారాయణరెడ్డి, పోస్టల్ సూపర్డెంట్ వి వెంకటేశ్వర్లు, జె పి ఎం రవి, టిసిఎస్ అధికారి లోకేష్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
పెన్షన్లు ఏ ఆధారం లేని వారికి భద్రత కలిగిస్తుంది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES