Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాత రహదారి బంగ్లాలో పెన్షన్లు ఇవ్వాలి  

పాత రహదారి బంగ్లాలో పెన్షన్లు ఇవ్వాలి  

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను 
వృద్ధులు, వికలాంగులు, వితంతు మహిళ పెన్షనర్ల సౌకర్యార్థం,  కొలనుపాక రోడ్డు,పాత మున్సిపల్ కార్యాలయం ముందు రహదారి బంగ్లా వద్ద పెన్షన్లు ఇవ్వాలని,1 వార్డు  కౌన్సిలర్ పాకాల మౌనిక హరీష్ మంగళవారం మున్సిపల్ అధికారులను కోరారు.

రైల్వే గేట్ ఇవతల వైపు ఉన్న ఆరువార్డులకు చెందిన పెన్షనర్లు రైల్వే గేట్ అవతల వైపు ఉన్న, పోస్ట్ ఆఫీస్ కార్యాలయానికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయి రైల్వే పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తుందని, రైల్వే కోటర్స్ కొలంపాక రోడ్ లో ఉన్నవారికి రైల్వే స్టేషన్ లో నుండి వెళ్దామంటే కోతుల బెడద ఉందని, రైల్వే బ్రిడ్జి ఎక్కి వెళ్లలేరని , వాహనాలలో వెళ్లేందుకు తగిన  సౌకర్యం లేదని, ఆవేదన వ్యక్తం చేస్తూ, మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ వి.ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు.

ఈ విషయంపై కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ వి.ఆంజనేయులు స్పందించి, పోస్ట్ ఆఫీస్ అధికారికికి ఫోన్ చేసి, మరొక సెంటర్ ని ఒకటో వార్డులోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.  సనుకూలంగా స్పందించి ఏర్పాటు చేస్తామని పోస్ట్ ఆఫీస్ అధికారులు తెలియజేసినట్లు చెప్పారు. త్వరితగతిన స్పందించిన కమిషనర్, తహసిల్దార్ కి కౌన్సిలర్ పాకాల మౌనిక హరీష్ ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -