గ్రామ గ్రామాన వేలాదిగా తరలి రండ
ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జీ బిర్రు మహేందర్ మాదిగ
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచాలి అని ఎమ్మార్పియస్ జిల్లా ఇంచార్జీ బిర్రు మహేందర్ మాదిగ అన్నారు. మంగళవారం, యాదగిరిగుట్ట మండలం కాచారం వికలాంగుల పెన్షన్ రూ 6 వేలకు మరియు వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అన్ని రకాల చేయూత పెన్షన్ 4 వేలకు పెంచాలనే డిమాండ్ తో చేయూత పెన్షన్ దారులతో గ్రామ సభ సీనియర్ నాయకులు గ్రామ ఇంచార్జీ బీభీనగర్ లక్ష్మణ్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిర్రు మహేందర్ మాదిగ మాట్లాడుతూ ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికలాంగుల పెన్షన్ రూ 6 వేలకు పెంచి ఇస్తున్నాడు. కానీ తెలంగాణలో రూ 6 వేలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులను మోసం చేశాడని అన్నారు.
2023 ఎన్నికల సమయంలో వికలాంగుల పెన్షన్ 6 వేలు, మిగితా చేయూత పెన్షన్ దారుల పెన్షన్ రూ 4 వేలకు పెంచుతామని రేవంత్ రెడ్డి బహిరంగంగా హామీ ఇచ్చారు. ఈ నెల ఓటు వేయండి, వచ్చే నెల పెరిగే పెన్షన్ తీసుకొండని మాట్లాడిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి 20 నెలలు దాటినా ఒక్క రూపాయి కూడా పెంచలేదని అన్నారు. ఇది ఘోరమైన మోసం అని అన్నారు. ఈ మోసం గురించి ప్రతిపక్షాలు కూడా మాట్లాడకుండా చేయూత పెన్షన్ దారులకు అన్యాయం చేస్తున్నాయని అన్నారు. కాబట్టే 50 లక్షల మంది పెన్షన్ దారుల పక్షాన మంద కృష్ణ మాదిగ పోరాటానికి శ్రీకారం చుట్టారని అన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి పెన్షన్ దారుల పెన్షన్ పెంచాలని లేకుంటే సెప్టెంబర్ 9 న హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో లక్షలాది మంది తో చేయూత పెన్షన్ దారుల గర్జన మహాసభ ను నిర్వహిస్తున్నాం అని జిల్లా, నియోజక వర్గ పరిధిలో ఉన్న అన్ని రకాల చేయూత పెన్షన్ దారులు మహాసభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన దండోరా జెండాను ఆవిష్కరణ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మదిగ, ఎం ఆర్ పి ఎస్ మొదటి తరం నాయకులు జాతీయ నాయకులు కందుల శంకర్ మాదిగ, మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి, మండల ఇంచార్జీ బూడిద జానీ మాదిగ, సుంచు దేవయ్య మాదిగ, ఎం జే ఎఫ్ నాయకులు సుంచు బాలయ్య మాదిగ, విహెచ్పిఎస్ నాయకులు ఎండి ఖలీల్, వృద్ధుల వితంతువుల, బీడీ కార్మిక గీత నేత కార్మిక చేయూత పెన్షన్ దారులు కొండం కృష్ణా రెడ్డి,నమిలే నర్సయ్య,సుంచు మల్లమ్మ, గార్లపాటీ లత, పారెల్లి కవిత, ఇప్ప ఊర్మిళ బీబీనగర్ ప్రమీల, దడిగే సుప్రియ తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES