నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలు, ఆయకట్టు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఎవరూ కూడా వాగులు, కాలువలు, చెరువులు, జలపాతాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు.అదేవిధంగా ఎవరివైనా పాత ఇండ్లు కూలిపోయే దశలో ఉంటే అప్రమత్తంగా ఉండి, గ్రామ పంచాయతీకి సమాచారం ఇచ్చి పునరావాస కేంద్రంలో ఉండాలని సూచించారు.
వర్షాలు కురుస్తున్నందున విద్యుత్ స్తంభాలను ముట్టుకోరాదనీ, విద్యుత్ తీగలు ఎక్కడ అయిన తెగి వుంటే వెంటనే విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలని తెలిపారు. మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామ ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో గ్రామ పంచాయతీకి సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు.