- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అధికారంలో ఉన్నా.. లేకున్నా ..ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులే తమకు వెన్నుదన్ను అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసిన ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. అధికారం శాశ్వతం కాదని, తామెల్లపుడు ఉద్యోగుల పక్షాన ప్రజల పక్షాన ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా కృషి చేస్తామన్నారు. అలాగే ఉద్యోగులను, ప్రజలను కాపాడుకోవాదం తమ బాధ్యత వివరించారు. అధికారంలోకి వచ్చినప్పటినుండి తమ ప్రభుత్వం అదే పద్ధతి కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.
- Advertisement -