నవతెలంగాణ – అశ్వారావుపేట
హైద్రాబాద్ కు వెళ్ళిన ప్రతీ సారి బాధితులు తనకు ఇచ్చిన అర్జీలను సంభందిత కార్యాలయాల్లో అందించడం, అర్హులకు మంజూరీ అయిన పత్రాలను, చెక్కులను తీసుకుని రావడం స్థానిక ఎమ్మెల్యే కు నిత్యకృత్యంగా మారింది. ప్రస్తుతం హైద్రాబాద్ లో ఉన్న ఆయన మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యాలయాన్ని సందర్శించి, తెలంగాణ సెక్రటేరియట్ ముఖ్యమంత్రి సహాయ నిధి విభాగంలో అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల నుంచి సీయం ఆర్ఎఫ్ కోసం వచ్చిన దరఖాస్తులను సంభందిత అధికారికి అందజేసారు. మంజూరైన అర్హత పత్రాలను తీసుకున్నారు. దీంతో నియోజక వర్గం ప్రజలు ఎమ్మెల్యే జారె ఆదినారాయణపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఎమ్మెల్యే జారెపై ప్రశంసలు కురిపిస్తున్న ప్రజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES