Friday, February 6, 2026
E-PAPER
Homeజిల్లాలుసీఎం సభకు భారీగా తరలిన ప్రజలు

సీఎం సభకు భారీగా తరలిన ప్రజలు

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
శుక్రవారం జిల్లా కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం సభను విజయవంతం చేసేందుకు మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ నేతృత్వంలో భారీగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు జిల్లా కేంద్రానికి భారీగా తరలివెళ్లారు. వీరితో పాటు మహిళా సంఘాల మహిళలు ఇందిరమ్మ చీరలు కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా బయలుదేరారు. అంతేకాదు.. మండల పరిధిలోని గ్రామాల సర్పంచులు చెలిమేల శ్రీనివాస్, మాజీ సొసైటీ చెమేన్లు చెలిమేల మల్లికార్జున్, జనార్దన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగీత్య నాయక్, వైజీర్, మోతె గంగారెడ్డి, భగవంత్ రెడ్డి, సుభాష్ రెడ్డి, జోగినిపల్లి శేఖర్ గౌడ్, జాన్ రెడ్డి, నారబోయిన రవి, అబ్దుల్ హమీద్, చక్రపాణి, ఎజ్జా శ్రీకాంత్, మాలవత్ బాలు,రావుజీ, గాదె నరేష్, మైలారం నాయకులు మధు,అక్బర్, కేసారం సర్పంచ్ యాట నర్సారెడ్డి, రేకులపల్లి సర్పంచ్ రాజేందర్, గుడి తండా నాయకులు రమేష్, మోహన్ లాల్, లోక్కిడి రాములు, మద్దుల్ తండా, నడిమి తండా, కొట్టాలపల్లి గ్రామాల సర్పంచులు కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -