నవతెలంగాణ – మద్నూర్
మండల ప్రజలు పురాతనమైన ఇళ్లల్లో నివసించే వారు భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని మండల తహశీల్దార్ ఎండి ముజీబ్ ప్రజలకు తెలియజేశారు. మండలంలోని హెచ్ కెలూర్ గ్రామంలో గోడకూలి ఇద్దరు వృద్ధులకు స్వల్ప గాయాలైన సందర్భంగా తహశీల్దార్ ఆ గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలకు మండల ప్రజలకు పురాతనమైన ఇండ్ల గురించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలకు ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున, పురాతనమైన ఇండ్లు ప్రమాదాలకు గురి చేసే ఆస్కారం ఉందని తెలిపారు. అలాంటి ఇండ్లలో నివసించేవారు ప్రమాదాలకు గురికాకుండా ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులు అవగాహన కల్పించారు. తహశీల్దార్ వెంట ఆర్ఐ శంకర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు, హెచ్ కెలూరు గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పురాతనమైన ఇండ్లలో నివసించే ప్రజలు భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -