క్రిష్ణ మండల ఎస్సై ఎంఎస్ నవీద్
నవతెలంగాణ – క్రిష్ణ
కృష్ణ నది పరివాహాక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని క్రిష్ణ మండల ఎస్సై షేక్ మహ్మద్ నవీద్ అన్నారు. కృష్ణ నదీ పరివాహాక ప్రాంతాలైన వాసునగర్, మారుతి నగర్, గురజాల, హిందూపుర్, బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కృష్ణ నది ఉధృతిని పరిశీలించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువన ఉన్న ఆల్మట్టి నారాయణపురం డ్యాం నుంచి 25 గేట్లను ఎత్తినందుకు నదిలో నీటి ప్రవాహం ఉదృతంగా పెరిగే అవకాశముందన్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కావున నదీ పరివాహాక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం ఉండి ఎప్పుడూ నదిలో నీటి ప్రవాహం పెరుగుతుందో తెలియదు కాబట్టి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల నివారణకు అధికారులకు, పోలీసులకు సహకరించాలని కోరారు. పిల్లలు సరదాగా ఈత కొట్టడానికి, సెల్ఫీ దిగడానికి వెళ్లరాదని, రైతులు నది పక్కన పొలాల్లో ఉన్న విద్యుత్ మోటర్లను బయటకు తెచ్చుకోవాలని, పశువులు, మేకలు, గొర్రెలలను పొలాల నుంచి ఇళ్లకు తరలించుకోవాలని కాపారులకు సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, వలలను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలని అత్యవసర పరిస్థితి ఏర్పడితే 100 కి కాల్ చేసే సమాచారం ఇవ్వాలని కృష్ణ ఎస్సై కోరారు.
నది ప్రవాహక ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -