Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మనుషులలో మార్పు రావాలి: పాస్టర్ రాజారత్నం 

మనుషులలో మార్పు రావాలి: పాస్టర్ రాజారత్నం 

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
ప్రతి మనిషి గతంలో జరిగిన విషయాలను విడిచిపెట్టి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మార్పు అనేది ప్రతి మనిషిలో రావాలని, దేవుని యందు, భక్తి , సేవాగుణం కలిగి ఉండాలని పాస్టర్ రాజారత్నం అన్నారు. నూతన  సంవత్సరం సందర్భంగా మండల కేంద్రంతో పాటు వాడియాల, మున్ననూర్, దోనూర్, రెడ్డిగూడెం, కొత్తూర్, బోయినపల్లి, అన్ని గ్రామాలలోనీ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పాస్టర్లు ఏసుక్రీస్తు  సేవ కార్యక్రమాల పైన  అవగాహన కల్పించారు. అనంతరం దేశ ప్రజలందరికీ సంతోషంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, జాను, నూతమ్మ, విజయ కుమారి, సువార్త రాజు, దేవదాస్ నాయుడు, మాజీ ఎంపీపీ  సుదర్శన్, సంపత్ కుమార్, విజయ్ కుమార్, సంఘ పెద్దలు బాలయ్య,భీమయ్య, వెంకటయ్య, ప్రభుదాస్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -