నవతెలంగాణ – బాల్కొండ
వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన సందర్భంగా రెండు రోజులపాటు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ శ్రీధర్ హెచ్చరించారు. మండల పరిధిలోని ప్రజలు ఎవ్వరు కూడా వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. పాడుబడ్డ పాత ఇండ్లు కూలిపోయే దశలో ఉంటే అప్రమత్తంగా ఉండి గ్రామపంచాయతీ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. భారీ వర్షాల కారణంగా విపత్కర పరిస్థితిలో ఉంటే తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 7013793521 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కంట్రోల్ రూమ్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని తహసీల్దార్ శ్రీధర్ పేర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహసీల్దార్ శ్రీధర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES