- Advertisement -
నవతెలంగాణ – వంగూరు
గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కావున ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప ఎవరు కూడా బయటకు రాకూడదని ఎస్ఐ మహేష్ సూచించారు. వంగూరు మండల కేంద్రం నుండి కల్వకుర్తికి వెళ్లే దారి మరియు చింత పెళ్లికి వెళ్లే దారి సర్వారెడ్డి పెళ్ళికి వెళ్లే దారి బ్లాక్ చేయడం జరిగింది అని అన్నారు. వంగూరు మండల ప్రజలు అత్యవసరం ఉంటే వెలుమల్లపల్లి నుండి కల్వకుర్తికి వెళ్లవలసింది అని అన్నారు. మరియు విద్యుత్ స్తంభాల కు తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
- Advertisement -



