Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుభారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

భారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి : వనపర్తి జిల్లాలో భారీ వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అదర్శ్ సురభి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల సమయంలో ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేందుకు జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రమాదకర పరిస్థితి ఏర్పడితే వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 08545-233525, 08545-220351 నువ్వు సంప్రదించవచ్చు అని తెలిపారు. ప్రజలు వానకు సంబంధించి ఎలాంటి అపాయకర పరిస్థితులు, నీటి ముంపు ప్రాంతాలు ఇతర సమస్యలు పై వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నదని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad