– ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్.
నవతెలంగాణ- రాయపోల్ : రాష్ట్ర వ్యాప్తంగా మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రజలందరూ అవస్థలు పడుతున్నారని రైతులు పంటలు తడిచిపోయే ప్రమాదం ఉందని, వరి పంటలు కోతలు ఎవరు మొదలు పెట్టవద్దన్నారు. ప్రజలు, మహిళలు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చెరువులు కుంటలు నిండుకుండలాగా ఉన్నాయని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని, గ్రామాలలో వ్యవసాయ పొలాలకు పనులకు వెళ్లిన రైతులు ఇంటికి త్వరగా తిరిగి రావాలన్నారు.
గాలి దుమారాలకు విద్యుత్ వైర్లు తెగిపడతాయని కరెంటు స్తంభాలు విద్యుత్ వైర్లను నేరుగా తాకరాదని సూచించారు. ముఖ్యంగా గర్భిణీ మహళలు, వృద్ధులు, చిన్నపిల్లలు బయట ప్రదేశాలు మొత్తం బురదమయమై ఉంటుంది కాబట్టి జారి పడిపోయే ప్రమాదం ఉంది. వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు అతివేగంగా వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్లాలన్నారు. లోతట్టు ప్రాంతాలలో ఉండే ప్రజలు అవసరమైతే తప్ప బయటకి వెళ్లకూడదు. అత్యవసర పనులు ఉంటే మాత్రమే జాగ్రత్తగా వెళ్లి త్వరగా ముగించుకొని రావాలన్నారు. వర్షాలు ముగిసే వరకు మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.



