- Advertisement -
తహశీల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ విక్రమ్..
నవతెలంగాణ – నవాబు పేట
మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ప్రజల అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ శ్రీనివాస్ ఎస్ఐ విక్రమ్ సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యంగా శిథిలావస్థకు చేరిన ఉండకూడదని ఇనుప విద్యుత్ స్తంభాలతో జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుపై వెళ్లే వాహనదారులు జాగ్రత్తగా తమ వాహనాల నడపాలి. లోతట్టు ప్రాంతాలలోని చెరువులు, కుంటలు,నీటి ప్రవాహాల వద్దకు వెళ్ళవద్దు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు తగిన జాగ్రత్తలను పాటించాలి. అత్యవసర పరిస్థితులలో సంబంధించిన అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
- Advertisement -



