Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజలు వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి: తహశీల్దార్

ప్రజలు వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి: తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండల ప్రజలు కురుస్తున్న భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని తిమ్మాజిపేట మండల తహశీల్దార్ రామకృష్ణ అన్నారు. అత్యవసర పనులకు తప్ప బయటికి రాకూడదని తెలిపారు. కరెంటు స్తంభాలను తాకవద్దని గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఎవరైనా నివసిస్తే వారు తక్షణమే గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉండాలన్నారు. వర్షాలకు రహదారులు చిత్తడిగా ఉంటాయి కాబట్టి వాహనాలు నెమ్మదిగా నడపాలని అన్నారు. మండలంలోని గ్రామస్తుల ఇండ్లు ఏవైనా కూలినట్లయితే ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నెంబర్ 085 402 938 11 కి కాల్ చేసి సమాచారం ఇవ్వలని తహశీల్దార్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -