Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

కాసుల వద్ద పలు జాగ్రత్తలు తీసుకోవాలి 
ప్రమాదాలు పొంచి ఉన్న స్థలం వద్దకు ఎవరు కూడా వెళ్ళకూడదు
నెల్లికుదురు ఎస్సై చిర్రా రమేష్ బాబు 
నవతెలంగాణ – నెల్లికుదురు

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లికుదురు ఎస్సై సీతా రమేష్ బాబు తెలిపారు. బుధవారం మాట్లాడుతూ జల మయం ఐన రోడ్ లు, వంతెనలు,వాగులు దాటే ప్రయత్నం ఎవరు కూడా చేయ వద్దు,అత్యవసర సమయాల లో డయల్‌ 100,1077 నంబర్లకు ఫోన్ చేయాలని అన్నారు. గత రెండు రోజులు గా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు,వంతెనలు ఉధృతం గా ప్రవహిస్తున్న నేపథ్యం లో ఎవ్వరు కూడా నీట మునిగిన రోడ్ లు,వంతెన లు, వాగులు దాటే ప్రయత్నం చేయ వద్దని హెచ్చరించారు.

అలాగే చేపల వేట కు వెళ్ల రాదని, పశువుల కాపర్లు చెరువులు,వాగు లు దాటకూడదని,యువకులు సెల్ఫీ ల కోసం నీటి ప్రవాహం వద్ద కు వెళ్ల రాదని సూచించారు.వాతావరణ శాఖ హెచ్చరిక ల మేరకు రాబోయే రోజుల లో కూడా వర్షాలు కొన సాగే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు పిల్లలు బయట కు వెళ్లకుండా జాగ్రత్త లు తీసు కోవాలని విజ్ఞప్తి చేశారు.అత్యవసర పరిస్థితుల లో డయల్‌ 100 లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌ 1077 కు సమాచారం అందించాలని సూచించారు.

 జిల్లా లోని చెరువులు,వాగులు వద్ద పోలీస్ పెట్రోలింగ్‌ ను పెంచి ప్రజల లో అప్రమత్తత కల్పించేందుకు చర్య లు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా వంతెన లు,చప్టల వద్ద బారికేడ్ లు ఏర్పాటు చేశామని సంబంధిత మా పోలీస్ సిబ్బందికి  ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే ఎగువ ప్రాంతాల లో వర్షాలు కొనసాగుతున్నందున వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నదని, అధికారులు,ప్రజలు తగు జాగ్రత్త లు తీసు కోవాలని సూచించారు. వీరి వెంట ఏ ఎస్ ఐ లు, హెడ్ కానిస్టేబుల్ లు, కానిస్టేబుల్ లో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -