Thursday, May 22, 2025
Homeతెలంగాణ రౌండప్సైబర్ మోసగాళ్ల నుండి ప్రజలను అప్రమత్తం చేయాలి..

సైబర్ మోసగాళ్ల నుండి ప్రజలను అప్రమత్తం చేయాలి..

- Advertisement -

గంజాయికి బానిసవుతే అలాంటి వారికి కౌన్సిలింగ్ చేయాలి ..

డిచ్పల్లి  పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

నవతెలంగాణ డిచ్ పల్లి

సైబర్ మోసగాళ్ల బారిన ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, గెమింగ్ యాప్ ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికీ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిoచాలని, గంజాయి నిర్మూలనకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేయడం జరిగిందని, ఎవరయిన గంజాయికి బానిసవుతే అలాంటి వారికి కౌన్సిలింగ్ చేయాలని, గంజాయి  నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య పేర్కొన్నారు.బుదవారం డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ ను బుధవారం పర్యవేక్షించారు. పోలీస్ స్టేషన్ ను మొత్తం కలియ తిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.  రిసిప్షన్ సెంటర్ల  పనితీరును , కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.  5S విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకొని మొత్తం పరిశీలించి పలు సూచనలు చేశారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించారు.  ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాదారులకు జరుగుతున్నందున, తప్పనిసరిగా హెల్మేట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు.సిబ్బoది  సాధక బాధలు ప్రతీ ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్  డిచ్ పల్లి ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ షరీఫ్, డిచ్పల్లి మహిళా ఎస్ ఐ సుహాసిని పోలీస్ స్టేషన్ సిబ్బంది  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -